News October 3, 2024
దేవుడికి అపచారం జరిగితే ఊరుకుంటామా?: పవన్

AP: తనను వ్యక్తిగతంగా హేళన చేసినా ఎన్నడూ స్పందించలేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అలా అని సాక్షాత్తూ కలియుగ వేంకటేశ్వరుడికే అపచారం జరిగితే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. ‘అన్నీ రాజకీయాల కోసమేనా? ఇలాంటి సభలో మాట్లాడతానని అనుకోలేదు. 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు. ఇది సినిమా, రాజకీయ సమయం కాదు. భగవంతుడి సమయం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 9, 2026
T20WC: చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్

T20WC-2026లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇటలీతో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 207/4 స్కోర్ చేసింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో 200+ రన్స్ చేసిన తొలి అసోసియేట్ టీమ్(టెస్టు హోదా లేని జట్టు)గా చరిత్ర సృష్టించింది. గతంలో USA 197/3(vsCAN), CAN 194/5(vsUSA), NED 193/4(vsIRE) స్కోర్ చేశాయి. ఇక ఈ మ్యాచ్‌లో జార్జ్ మున్సే 84(54 B), బ్రెండన్ మెక్‌ముల్లెన్ 41(18 B), మైఖేల్ లీస్క్ 22(5 B) అదరగొట్టారు.
News February 9, 2026
మాఘ స్నానం ఇంకా చేయలేదా?

మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో నదీ స్నానాలు చేయాలంటారు. ఒకవేళ చేయలేకపోతే చివరి రోజు ఓ పరిహారం పాటించాలంటున్నారు పండితులు. అలా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. ‘ఇంట్లో ప్రతికూల శక్తి పోవాలంటే కర్పూరంలో 11 లవంగాలు వేయాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా చూపాలి. ఆర్థిక ఇబ్బందుల తొలగింపునకు తమలపాకుపై కుంకుమపువ్వుతో ‘శ్రీ’ అని రాసి పూజ గదిలో ఉంచాలి. భార్యాభర్తలు దీపారాధన చేయాలి’ అని సూచిస్తున్నారు.
News February 9, 2026
రూ.3వేల కోట్లతో రోడ్ల నిర్మాణం: సీఎం

AP: వచ్చే మూడేళ్లలో అమరావతిని మోస్ట్ లివబుల్ సిటీగా మారుస్తామని సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో అన్నారు. పోలవరాన్ని 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. మెగా డీఎస్సీతో 16వేల టీచర్ ఉద్యోగాలు, 5వేల కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశామన్నారు. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేశామని, మరో రూ.3వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు.


