News November 28, 2024
మరో వికెట్ తీస్తే బుమ్రా పేరిట ఆ రికార్డు
టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో వచ్చే నెల 6 నుంచి జరిగే డే నైట్ టెస్టులో ఓ వికెట్ తీస్తే 2024లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలుస్తారు. పెర్త్ టెస్టులో ఆయన 8 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఇక భారత స్పిన్నర్ అశ్విన్ 50 వికెట్ల మార్కుకు 4 వికెట్ల దూరంలో ఉన్నారు.
Similar News
News December 14, 2024
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈయనే..
TG: పుష్ప-2లో పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు SP షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమవుతాడు. అది రీల్ స్టోరీ. కానీ రియల్ స్టోరీలో అల్లు అర్జున్‌ను ఓ సీఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోత్ రాజు నాయక్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బన్నీకి రాజు నాయక్ పెద్ద అభిమాని. అర్జున్‌తో ఒక్కసారైనా ఫొటో దిగాలని అనుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని ఆయన ఊహించి ఉండకపోవచ్చు!
News December 14, 2024
రాష్ట్రంలో మళ్లీ గజగజ..!
TG: రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12, హన్మకొండలో 12.5, రామగుండంలో 13.4, నిజామాబాద్‌లో 13.9, దుండిగల్‌లో 14.8, హకీంపేట్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.
News December 14, 2024
గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లోనే బన్నీ
చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ తొలుత జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. బన్నీని కలిసేందుకు నిర్మాత దిల్ రాజు సహా సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపు అర్జున్ ఆఫీస్‌లోనే ఉండనున్నారు. అనంతరం నివాసానికి వెళ్తారు. అక్కడికి అభిమానులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.