News March 14, 2025

నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: రాజగోపాల్ రెడ్డి

image

TG: తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీ, ప్రజలకే లాభమని మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలిపారు. ‘నిద్రాహారాలు మాని భువనగిరి MP సీటును గెలిపించా. 2018లో నేను INC తరఫున పోటీ చేస్తే BJPకి, ఆ తర్వాత BJP నుంచి బరిలో ఉంటే INCకు డిపాజిట్ రాలేదు. 2023లోనూ INC నుంచి పోటీ చేస్తే BJPకి డిపాజిట్ దక్కలేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 14, 2025

హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్‌కళ్యాణ్ అన్న: లోకేశ్

image

AP: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్‌కళ్యాణ్ అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు. రాష్ట్ర ఆర్థిక, సంక్షేమాభివృద్ధిలో జనసేన నిబద్ధత అనిర్వచనీయం. ఆ పార్టీ కృషి అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని పేర్కొన్నారు. దీనికి ‘జనసేన జయకేతనం’ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

News March 14, 2025

అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో రెండు భారత హోటళ్లు

image

టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచంలోని అత్యుత్తమ ప్రాంతాలు’ జాబితాలో భారత్‌ నుంచి జైపూర్‌ రాఫిల్స్, బాంధవ్‌గఢ్‌లోని ఒబెరాయ్ వింధ్యావిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్స్ చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ అద్భుతమైన ప్రాంతాలని చెప్పిన టైమ్, ముంబైలోని పాపాస్ రెస్టారెంట్‌ను చూడాల్సిన చోటుగా పేర్కొంది. ఈ జాబితాలో మ్యూజియాలు, పార్కులు, పర్యాటక ప్రదేశాలు తదితర ప్రాంతాలను టైమ్ పరిగణించింది.

News March 14, 2025

OTTలోకి వచ్చేసిన కంగనా ‘ఎమర్జెన్సీ’

image

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, 3 రోజుల ముందే రిలీజ్ చేశారు. ఇందులో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించారు. ఈ సినిమాతో పాటు రాషా తడానీ, అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘ఆజాద్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

error: Content is protected !!