News December 20, 2024

ఇది అప్పుడే తెలిస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేది: అశ్విన్

image

రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తనకు వచ్చిన కాల్స్ స్క్రీన్‌షాట్‌ను టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ షేర్ చేశారు. ‘25 ఏళ్ల క్రితం ఎవరైనా నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందని, భారత క్రికెటర్‌గా నా కెరీర్ చివరి రోజు కాల్ లాగ్ ఇలా ఉంటుందని చెబితే, నాకు గుండెపోటు వచ్చి ఉండేది’ అని ఆయన ట్వీట్ చేశారు. సచిన్, కపిల్ దేవ్ లాంటి గొప్ప క్రికెటర్ల నుంచి కాల్ రావడం ఆశీర్వాదం అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 22, 2025

తండ్రి కాబోతున్న నాగచైతన్య.. నాగార్జున క్లారిటీ

image

హీరో నాగచైతన్య తండ్రి కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తండ్రి నాగార్జున ఖండించారు. సరైన సమయంలో చెబుతానని తాను మర్యాదపూర్వకంగా చెప్పిన సమాధానాన్ని మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉందన్నారు. అటు కోడలు శోభిత అన్ని విషయాల్లోనూ పాజిటివ్‌గా ఉంటారని, ఆమె రాకతో తమ జీవితాల్లోకి సంతోషం వచ్చిందని నాగ్ పేర్కొన్నారు.

News December 22, 2025

మన టాప్-4 కంపెనీల విలువ కంటే మస్క్ సంపదే ఎక్కువ

image

ఎలాన్ మస్క్ సంపద ఫోర్బ్స్ ప్రకారం 748 బి.డాలర్లకు చేరింది. రిచ్ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న లారీ పేజ్ కంటే ఆయన సంపద 496 బి.డాలర్లు ఎక్కువ. అలాగే ఇండియాలో మార్కెట్ క్యాప్ పరంగా టాప్-4లో ఉన్న రిలయన్స్, HDFC, Airtel, TCS విలువ కంటే కూడా మస్క్ సంపదే అధికం. ఇటీవల అక్కడి కోర్టు మస్క్‌కు రావాల్సిన టెస్లా స్టాక్ ఆప్షన్లు, వేతన ప్యాకేజీని పునరుద్ధరించడంతో ఆయన సంపద భారీగా పెరిగింది.

News December 22, 2025

యూనస్ నాయకత్వం ‘బంగ్లా’కు ప్రమాదకరం: షేక్‌ హసీనా

image

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా స్పందించారు. యూనస్ నాయకత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. మైనారిటీలపై పెరుగుతున్న దాడులు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, భారత్‌ సహా పొరుగు దేశాలతో సంబంధాలకు ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. తీవ్రవాద శక్తులకు యూనస్ ప్రభుత్వం అవకాశం ఇస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.