News December 20, 2024

ఇది అప్పుడే తెలిస్తే నాకు హార్ట్ అటాక్ వచ్చేది: అశ్విన్

image

రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తనకు వచ్చిన కాల్స్ స్క్రీన్‌షాట్‌ను టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ షేర్ చేశారు. ‘25 ఏళ్ల క్రితం ఎవరైనా నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందని, భారత క్రికెటర్‌గా నా కెరీర్ చివరి రోజు కాల్ లాగ్ ఇలా ఉంటుందని చెబితే, నాకు గుండెపోటు వచ్చి ఉండేది’ అని ఆయన ట్వీట్ చేశారు. సచిన్, కపిల్ దేవ్ లాంటి గొప్ప క్రికెటర్ల నుంచి కాల్ రావడం ఆశీర్వాదం అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 26, 2025

RGV డైరెక్షన్‌లో వెంకటేశ్ సినిమా?

image

ఇక నుంచి తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీస్తానన్న RGV ‘సిండికేట్’ అనే మూవీని తీయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో మెయిన్ లీడ్‌గా విక్టరీ వెంకటేశ్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ లాంటి బిగ్ స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News January 26, 2025

జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు

image

తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెండాను ఎగురవేశారు. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొన్నారు.

News January 26, 2025

మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్: రష్మిక

image

తన కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. కండరాల్లో చీలిక కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘2 వారాలుగా కనీసం నడవలేకపోతున్నా. ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నా. నాపై మీరు చూపించే ప్రేమ, అభిమానం వల్లే నాకు ఈ నొప్పి తెలియడం లేదు. నాకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా’ అని పేర్కొన్నారు. కాగా రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ FEB 14న రిలీజ్ కానుంది.