News April 18, 2024
నవ్వాలనిపిస్తే పంత్‌తో మాట్లాడతా: రోహిత్

స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గురించి టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను నవ్వించే వారెవరైనా ఉన్నారంటే అది పంత్ ఒక్కడే. అతను క్రేజీగా ఉంటాడు. ప్రమాదం కారణంగా కొన్ని రోజులు క్రికెట్‌కు దూరం అవడంతో చాలా నిరాశ చెందాను. అతను తిరిగి వచ్చి క్రికెట్ ఆడటం చూసి చాలా సంతోషించా. నాకెప్పుడైనా నవ్వాలనిపిస్తే వెంటనే పంత్కి కాల్ చేస్తా’ అని రోహిత్ చెప్పారు.
Similar News
News October 29, 2025
టాస్ ఓడిన టీమ్ ఇండియా

ఇండియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
AUS ప్లేయింగ్ XI: మార్ష్(కెప్టెన్), హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, ఫిలిప్, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కుహ్నెమాన్, హేజిల్‌వుడ్
News October 29, 2025
అర్హుల ఓట్లు తొలగిస్తే కాళ్లు విరగ్గొడతాం: బెంగాల్ మంత్రి

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.
News October 29, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iiim.res.in.


