News April 18, 2024

నవ్వాలనిపిస్తే పంత్‌తో మాట్లాడతా: రోహిత్

image

స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌ గురించి టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను నవ్వించే వారెవరైనా ఉన్నారంటే అది పంత్ ఒక్కడే. అతను క్రేజీగా ఉంటాడు. ప్రమాదం కారణంగా కొన్ని రోజులు క్రికెట్‌కు దూరం అవడంతో చాలా నిరాశ చెందాను. అతను తిరిగి వచ్చి క్రికెట్ ఆడటం చూసి చాలా సంతోషించా. నాకెప్పుడైనా నవ్వాలనిపిస్తే వెంటనే పంత్‌కి కాల్ చేస్తా’ అని రోహిత్ చెప్పారు.

Similar News

News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

News November 19, 2025

ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు

image

ఏపీ మెడికల్& హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 8 కాంట్రాక్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్(మేనేజర్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, పీజీడీసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.61,960 జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb/

News November 19, 2025

HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

image

రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.