News July 1, 2024

నా దేశం, నా నేల కోసం పనిచేస్తా: పవన్ కళ్యాణ్

image

AP: CM, డిప్యూటీ CM కావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండాలనే అనుకున్నా. పదవుల కోసం కాదు. నా దేశం, నా నేల కోసం పనిచేస్తా. నా వైపు అవినీతి ఉండదు. ఓటు వేయని వారూ నన్ను ప్రశ్నించొచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తా. హంగులు, ఆర్భాటాలకు వెళ్లను. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ప్రజలు అనుకునేలా పాలన ఉంటుంది’ అని జనసేనాని స్పష్టం చేశారు.

Similar News

News October 12, 2024

శ్రీవారి హుండీ ఆదాయం రూ.26 కోట్లు: ఈవో

image

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. ‘వాహన సేవలను 15 లక్షల మంది తిలకించారు. గరుడ వాహనం రోజునే 3.3 లక్షల మంది వచ్చారు. 26 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 30 లక్షల లడ్డూలు పంపిణీ చేశాం. లడ్డూ నాణ్యతపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో హుండీ ఆదాయం రూ.26 కోట్లు లభించింది’ అని తెలిపారు. ఇవాళ ధ్వజారోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

News October 12, 2024

జమ్మి ఆకులే ‘బంగారం’!

image

తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావిస్తారు. దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆకులను ఆత్మీయులకు పంచుతారు. కొందరు పూజగదిలో భద్రపరుస్తారు. కుబేరుడు రఘుమహారాజుకు భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలో బంగారాన్ని కురిపించాడని, అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారని పురాణాలు చెబుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలుంటాయి. దీని గాలి పీల్చితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

News October 12, 2024

‘రంజీ ట్రోఫీ’కి ఆ పేరు ఎలా వచ్చింది?

image

నవానగర్ (ప్ర‌స్తుత జామ్‌న‌గ‌ర్‌) గల్ఫ్ ఆఫ్ కచ్ దక్షిణ తీర ప్రాంతం. గ‌తంలో దీన్ని జ‌డేజా రాజ్‌పుత్ రాజ‌వంశీయులు పాలించేవారు. ఇక్కడి రాజును జామ్ సాహెబ్‌గా పిలుస్తారు. న‌వాన‌గ‌ర్‌ను 1907 నుంచి రంజిత్‌సిన్హ్ జీ విభా జీ పాలించారు. ఈయ‌న ప్రపంచ ప్ర‌సిద్ధ క్రికెట్ ఆట‌గాడు. ఇంగ్లండ్ తరఫున ఆడారు. ఈయ‌న పేరు మీదే దేశంలో ఏటా రంజీ ట్రోఫీ జ‌రుగుతుంది. ఈ రాజవంశం నుంచి ఎక్కువ మంది క్రికెటర్లుగా రాణించారు.