News October 4, 2024
జాబులు పోవాలంటే చంద్రబాబే కదా రావాలి: VSR
AP: జాబులు పోవాలంటే ఎవరు రావాలి? చంద్రబాబే కదా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్‌లో తొలి విడతగా 4వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని అన్నారు. సంపద సృష్టి? బాబు వస్తే జాబు? అంటే ఇదేనా తెలుగు తమ్ముళ్లూ అంటూ Xలో పోస్ట్ చేశారు. ఇది ప్రైవేటీకరణకు మొదటి మెట్టు కాదా చంద్రబాబు? అని ప్రశ్నించారు.
Similar News
News November 7, 2024
అగరబత్తి పొగ మంచిదేనా..?
చాలామంది భక్తులు పూజల్లో అగరబత్తుల్ని విపరీతంగా వెలిగిస్తుంటారు. కానీ ఆ పొగ అంత మంచిది కాదని అమెరికాకు చెందిన NIH పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అగరబత్తుల పొగ ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. ఒక అగరబత్తిని వెలిగిస్తే 45 మి.గ్రాముల కంటే ఎక్కువ కణాలు విడుదలవుతాయని, అవి సిగరెట్‌కంటే ఎక్కువని తెలిపారు. ఆ పొగలో ప్రమాదకరమైన పలు కర్బన సమ్మేళనాలు ఉంటాయని వివరించారు.
News November 7, 2024
ట్రంప్‌నకు కమల ఫోన్ కాల్
డొనాల్డ్ ట్రంప్‌నకు కమలా హారిస్ ఫోన్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రంప్‌నకు కాల్ చేసి కంగ్రాట్స్ తెలిపారు. అధికార మార్పిడిపై చర్చించేందుకు వైట్‌హౌస్‌కు రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై US ప్రజలను ఉద్దేశించి బైడెన్ త్వరలోనే ప్రసంగించనున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
News November 7, 2024
‘పుష్ప2’ ఐటమ్ సాంగ్, ట్రైలర్‌పై అప్డేట్స్
ఎన్నో అంచనాల నడుమ అల్లు అర్జున్ ‘పుష్ప2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్యాచ్‌వర్క్ షూట్ నిన్న ముగిసింది. కాగా శ్రీలీలతో ఐటెమ్ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. నవంబర్ 12 లేదా 13 నాటికి షూటింగ్ మొత్తం ముగియనుందని సమాచారం. కాగా ఈ మూవీ ట్రైలర్ 3 నిమిషాల 45 సెకన్లకు లాక్ చేసినట్లు టాక్. NOV 15న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. DEC 5న మూవీ విడుదలవనుంది.