News November 19, 2024

కేసీఆర్ చెబితే మూసీ శుద్ధి పనులు ఆపేస్తాం: కోమటిరెడ్డి

image

TG: 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ మూసీ శుద్ధి చేయొద్దని చెబితే వెంటనే ప్రాజెక్టును ఆపేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు అరెస్ట్ భయం పట్టుకుందని, అందుకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇక కిషన్ రెడ్డి నగరంలో మూసీ పక్కన ఒక్క రాత్రి నిద్రించడం కాదని, దమ్ముంటే 3 నెలలు నల్గొండలో నిద్ర చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

Similar News

News December 13, 2024

పుష్కరాల్లో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?: RGV

image

అల్లు అర్జున్ కేసుకు సంబంధించి పోలీసులకు RGV 4 ప్రశ్నలు వేశారు. ‘పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నేతలను అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్‌ను అరెస్ట్ చేస్తారా? భద్రత ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు?’ అని ప్రశ్నించారు.

News December 13, 2024

డ్రామాలతో కాంగ్రెస్ డైవర్షన్ పాలన: బండి సంజయ్

image

అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, మధ్యంతర బెయిల్ ఘటనలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘ఇలా డ్రామాలు చేసి డైవర్షన్ పాలన సాగిస్తోందీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకప్పుడు తప్పుడు పాలన చేసి రాష్ట్రాన్ని దోచుకున్నవారు స్వేచ్ఛగా తిరుగుతుంటే, జాతీయ అవార్డు గ్రహీత నటుడిని మాత్రం అరెస్ట్ చేశారు. సెన్సేషనలిజం వారి అసమర్థతను దాచలేదు. కాంగ్రెస్ నాటకాన్ని దేశం మొత్తం చూసింది’ అని ఫైరయ్యారు.

News December 13, 2024

గ్రేట్.. రక్త దానం చేసి 24లక్షల మంది శిశువులకు ప్రాణం!

image

‘మ్యాన్ విత్ ది గోల్డెన్ ఆర్మ్’ అని పేరున్న జేమ్స్ హారిసన్ 60 ఏళ్లుగా వారానికోసారి రక్త దానం చేస్తూ ఇప్పటి వరకు 24 లక్షల మంది శిశువులను రక్షించారు. ఈయన రక్తంలో ప్రత్యేకమైన యాంటీబాడీలు ఉన్నాయి. 14 ఏళ్ల వయస్సులో ఆయన రక్తమార్పిడిలో యాంటీ-డీని గుర్తించారు. ఆయనను ఆస్ట్రేలియాలో నేషనల్ హీరోగా పిలుస్తుంటారు. హారిసన్ దాతృత్వానికి అనేక అవార్డులూ ఆయన్ను వరించాయి.