News November 27, 2024

అదానీ కాకుంటే జగన్‌కు రూ.1750 కోట్ల లంచం ఎవరిచ్చినట్టు?

image

YS జగన్‌కు అదానీ రూ.1750 కోట్ల లంచం ఆరోపణల వివాదంలో మరో ట్విస్ట్. తమకు అదానీతో సంబంధం లేదని, సెకీతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని జగన్ బృందం తెలిపింది. తమ ప్రతినిధులు భారత అధికారులకు లంచమిచ్చినట్టు US కోర్టులో అభియోగాలే నమోదవ్వలేదని తాజాగా అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అవి అజూర్ పవర్, CDPQ ప్రతినిధులపైనే ఉన్నాయంది. మరి జగన్‌ లంచం తీసుకున్నారా? తీసుకుంటే అదానీ కాకుండా ఎవరిచ్చినట్టు?

Similar News

News March 11, 2026

మినిమం డిపాజిట్ చేయకపోతే అకౌంట్లు ఇనాక్టివ్!

image

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనుంది. మీ PPF, SSY (సుకన్య సమృద్ధి), NPS ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఆలోపు కనీస డిపాజిట్లు (PPF-₹500, SSY-₹250, NPS-₹1,000) చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ చేయలేకపోతే ఆ ఖాతాలు ‘ఇనాక్టివ్‌’ స్టేటస్‌లోకి వెళ్తాయి. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మిస్ అవుతారు.

News March 11, 2026

వివేకా హత్య కేసు.. సునీత పిటిషన్ల కొట్టివేత

image

AP: దివంగత ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డికి చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణ త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును SC ఆదేశించింది.

News March 11, 2026

వరల్డ్ కప్ గెలిచాక ట్రైన్‌లో ముంబైకి వెళ్లిన దూబే

image

ప్రపంచ కప్ గెలిచామన్న సంతోషం ఓ వైపు. ఈ మధుర క్షణాలను పిల్లలతో పంచుకోవాలనే ఆరాటం మరో వైపు. అదే సమయంలో విమాన టికెట్స్ దొరక్కపోవడంతో టీమ్ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే తన భార్యతో కలిసి రైలులో థర్డ్ ఏసీ కోచ్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్, క్యాప్ ధరించి పై బెర్త్‌పై పడుకుని సొంతూరుకు చేరుకున్నారు.