News February 5, 2025
ఆరోజు బుమ్రా ఉండి ఉంటే.: గిల్

BGT ఆఖరి టెస్టులో బుమ్రా గాయపడటం టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చిందని బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. ఆరోజు బుమ్రా ఫిట్‌గా ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు. ‘బుమ్రా గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడం దురదృష్టకరం. ఆయన ఉండి ఉంటే ఆ మ్యాచ్ కచ్చితంగా గెలిచేవాళ్లం. ఫలితంగా సిరీస్ 2-2తో సమమై మాపై విమర్శలు తప్పేవి. ఏదేమైనా.. మాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా మేం ఆడలేకపోయామన్నది వాస్తవం’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 23, 2026
ఘోరం: ఆస్పత్రిపై డ్రోన్ దాడి.. 64 మంది మృతి

సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్(RSF) మధ్య ఆధిపత్య పోరు సామాన్యుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా ఈద్ రోజున RSF ఆధీనంలో ఉన్న ఓ నగరంలోని ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 64 మంది మృతి చెందారు. వీరిలో 13 మంది పిల్లలు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నట్లు WHO వెల్లడించింది. మరో 89 మంది గాయపడినట్లు తెలిపింది. ఈ దాడిని ఆర్మీ చేసినట్లు RSF ఆరోపిస్తుండగా తమకు సంబంధం లేదని సైనికులు ప్రకటించారు.
News March 23, 2026
పేరెంట్స్‌ను పట్టించుకోకపోతే జీతంలో రూ.10వేలు కట్!

TG: కన్నవారిని పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాకివ్వనుంది. వారి జీతంలో 15% లేదా ₹10K కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్‌ను తీసుకురానుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదించనుంది. ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయనుంది.
News March 23, 2026
రాష్ట్రంలో 11వేలకుపైగా హెక్టార్లలో పంట నష్టం

AP: అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలోని 11,337 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 15 జిల్లాల్లోని 9,950 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9 జిల్లాల్లోని 1,387 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వరి 2,650 హెక్టార్లు, మొక్కజొన్న 6,450 హెక్టార్లు, మినుముకు 485 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. మరోవైపు యుద్ధంతో ఎగుమతులు తగ్గి రాయలసీమలో కమలాపండు పంట ధర టన్ను ₹10వేలు తగ్గి ₹22వేలకు చేరింది.


