News February 5, 2025

ఆరోజు బుమ్రా ఉండి ఉంటే.: గిల్

image

BGT ఆఖరి టెస్టులో బుమ్రా గాయపడటం టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చిందని బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. ఆరోజు బుమ్రా ఫిట్‌గా ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు. ‘బుమ్రా గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడం దురదృష్టకరం. ఆయన ఉండి ఉంటే ఆ మ్యాచ్ కచ్చితంగా గెలిచేవాళ్లం. ఫలితంగా సిరీస్ 2-2తో సమమై మాపై విమర్శలు తప్పేవి. ఏదేమైనా.. మాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా మేం ఆడలేకపోయామన్నది వాస్తవం’ అని స్పష్టం చేశారు.

Similar News

News February 11, 2026

గతంలోనూ అవిశ్వాసం.. ఏం జరిగిందంటే..?

image

గతంలోనూ ముగ్గురు స్పీకర్లు అవిశ్వాసాలు ఎదుర్కొన్నారు. 2సార్లు ఓటింగ్ జరిగినా అవి వీగిపోయాయి. ఓటింగ్ భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ‘<<19097533>>మెజారిటీ <<>>విషయంలో లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యను లెక్కలోకి తీసుకుంటారు. దీంతో అధికార పక్షానిదే మెజారిటీ అవుతుంది. తీర్మానం గట్టెక్కదు’ అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ ఆచారి తెలిపారు. గతంలో మౌలాంకర్(1954), హుకుం సింగ్(1966), బలరాం జాఖడ్(1987) అవిశ్వాసం ఎదుర్కొన్నారు.

News February 11, 2026

ఫీజు రీయింబర్స్‌మెంట్: కాలేజీల ఖాతాల్లోకే..

image

AP: నిన్న విడుదలైన రూ.1,200 కోట్ల <<19104256>>ఫీజు<<>> రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం కాలేజీల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో 2024-25 బకాయిలు క్లియర్ కానున్నాయి. అయితే 2023-24కు సంబంధించి రూ.1,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ నిధులను తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్సులు పూర్తి చేసుకొని వెళ్లిపోయిన వారినుంచి డబ్బులు ఎలా రాబట్టుకోవాలని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.

News February 11, 2026

జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

image

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.