News November 6, 2024

తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బీఆర్ నాయుడు

image

AP: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక బీఆర్ నాయుడు తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.

Similar News

News December 25, 2025

95 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ESIC<<>> మెడికల్ కాలేజీ& హాస్పిటల్, లూథియానా 95 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అప్లై చేసుకున్న వారికి జనవరి 8న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. టీచింగ్ ఫ్యాకల్టీకి గరిష్ఠ వయసు 69ఏళ్లు కాగా.. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45 ఏళ్లు. వెబ్‌సైట్: https://esic.gov.in/

News December 25, 2025

రష్యాలో క్రిస్మస్ ఎప్పుడో తెలుసా?

image

ప్రపంచమంతటా ఇవాళ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. రష్యా మాత్రం జనవరి 7న సెలబ్రేట్ చేసుకుంటుంది. దీనికో ప్రత్యేక కారణం ఉంది. 1582లో యూరప్‌ దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌ అనుసరించడం ప్రారంభించాయి. కానీ రష్యా ఆర్థడాక్స్ చర్చ్ జులియన్ క్యాలెండర్‌ను ఫాలో కావడం కొనసాగించింది. ఏళ్లు గడిచే కొద్దీ ఈ క్యాలెండర్ల మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో Jan 7(జులియన్ క్యాలెండర్‌లో Dec 25)న రష్యా క్రిస్మస్‌ జరుపుకుంటుంది.

News December 25, 2025

కోహ్లీ క్రేజ్.. VHT స్కోర్ కోసం 10 లక్షల సెర్చ్‌లు

image

కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్లు ఆడుతున్న విజయ్ హజారే ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో అభిమానులు గూగుల్‌ను ఆశ్రయించారు. ముఖ్యంగా కోహ్లీ లైవ్ స్కోర్ తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. 10 గంటల వ్యవధిలో ఢిల్లీ-ఆంధ్రా మ్యాచ్‌ అప్డేట్స్ కోసం 10 లక్షలకు పైగా సెర్చ్‌లు నమోదయ్యాయి. ఏకంగా 1,81,818 సార్లు రీఫ్రెష్ చేశారు. నిన్నటి మ్యాచ్‌లో కింగ్ 101 బంతుల్లో 131 రన్స్ చేసిన విషయం తెలిసిందే.