News November 6, 2024
తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బీఆర్ నాయుడు
AP: టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక బీఆర్ నాయుడు తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.
Similar News
News December 7, 2024
మార్చి 15 నుంచి టెన్త్ ఎగ్జామ్స్?
AP: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. కొత్త సిలబస్ ప్రకారమే ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారికి పాత సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి తదితర వివరాలు పొందుపరిచారు.
News December 7, 2024
18న గురుకుల సొసైటీ ప్రవేశాలకు నోటిఫికేషన్
TG: గురుకుల సొసైటీ ప్రవేశాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 12లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం లేదని వెల్లడించారు. పది పాసైన వారికి నేరుగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
News December 7, 2024
తెలంగాణలోనే ఎక్కువ సిజేరియన్లు
తెలంగాణలో సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్లు NFHS ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీ తెలిపింది. ఇక్కడ మొత్తం ప్రసవాల్లో 60.7% సిజేరియన్లేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది 21.5 శాతంగా ఉంది. అత్యల్పంగా నాగాలాండ్‌లో 5.2% సిజేరియన్లు జరుగుతున్నాయి. దక్షిణాదిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నాయి. సహజ ప్రసవాలపై భయం, ముహూర్తాలు చూసుకోవడం, ఆర్థిక స్తోమత వంటి అంశాలు సిజేరియన్లకు కారణాలవుతున్నాయి.