News December 19, 2024

రేవంత్ మగాడైతే ఆ టెండర్ రద్దు చేయాలి.. కేటీఆర్ సవాల్

image

TG: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై సీఎం రేవంత్ <<14924428>>సిట్ విచారణకు<<>> ఆదేశించడంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ రెడ్డికి దమ్ముంటే, మగాడైతే ఫస్ట్ టెండర్ రద్దు చేయమనండి’ అని సవాల్ విసిరారు. తాము శాంతియుతంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు.

Similar News

News January 16, 2025

చరిత్ర సృష్టించిన ప్రతిక

image

IND-W జట్టు ఓపెనర్ ప్రతికా రావల్ వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆడిన తొలి 6 ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్స్(444) సాధించిన ప్లేయర్‌గా నిలిచారు. ప్రతిక తర్వాతి స్థానాల్లో చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG)-434, నథాకన్(థాయ్‌లాండ్)-322, ఎనిడ్ బేక్‌వెల్(ENG)-316, నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)-307 ఉన్నారు. కాగా ప్రతిక సైకాలజీలో డిగ్రీ చేశారు. తండ్రి ప్రదీప్ దేశవాళీ టోర్నీల్లో అంపైర్.

News January 16, 2025

సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం: CBN

image

AP: గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టుపట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేం పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.

News January 16, 2025

‘దబిడి దిబిడి’ స్టెప్పులపై విమర్శలు.. ఊర్వశి ఏమన్నారంటే?

image

‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ పాటలో డాన్స్ స్టెప్పులపై విమర్శలు రావడంపై నటి ఊర్వశీ రౌతేలా స్పందించారు. ‘లైఫ్‌లో ఏం సాధించలేని కొందరు ఇలానే ట్రోల్ చేస్తుంటారు. వాళ్లు తమకు ఆ అర్హత ఉందనుకోవడం విడ్డూరం. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో పని చేసే అవకాశం దక్కడం నాకు దక్కిన గౌరవం. ఆయనతో పని చేయాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఆ డాన్స్ స్టెప్పులన్నీ కళలో భాగం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.