News January 11, 2025
రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే..

ODIల్లో రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలవనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్‌లు), సచిన్ (276 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్‌లలో 10,866 రన్స్ చేశారు. నెక్స్ట్ 19 ఇన్నింగ్స్‌లలో 134 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరుకుంటే సచిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తారు.
Similar News
News November 8, 2025
ఏపీలో 10, 11 తేదీల్లో కేంద్ర బృందాల పర్యటన

AP: మొంథా <<18145441>>తుఫాను<<>> ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా వేయడానికి 2 కేంద్ర బృందాలు ఈనెల 10, 11 తేదీల్లో పర్యటించనున్నాయి. హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి రానున్నారు. వీరు 2 టీమ్‌లుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూ.గో, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట ఇతర నష్టాలను పరిశీలిస్తారు.
News November 8, 2025
దొంగ-పోలీస్ గేమ్ ఆడుదామని అత్తను చంపేసింది!

AP: దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను కోడలు చంపేసిన ఘటన విశాఖ(D) పెందుర్తిలో జరిగింది. మహాలక్ష్మీ(63), ఆమె కోడలు లలిత మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న కోడలు దొంగ-పోలీస్ ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలతో పాటు కాళ్లు, చేతులు కట్టేసింది. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని చనిపోయినట్లు PSకు సమాచారం అందించింది. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
News November 8, 2025
యుద్ధానికి సిద్ధం.. పాక్‌కు అఫ్గాన్ వార్నింగ్

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి చర్చలు విఫలం అయ్యాయి. తుర్కియే, ఖతర్ మధ్యవర్తిత్వంలో ఇవాళ ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు పురోగతి లేకుండానే ముగిశాయి. పాకిస్థాన్ కారణంగానే ఈ సందిగ్ధత ఏర్పడిందని అఫ్గాన్ ఆరోపించింది. అవసరమైతే తాము యుద్ధానికైనా సిద్ధమని పాక్‌ను తాలిబన్ సర్కార్ హెచ్చరించింది. ఇక నాలుగో విడత చర్చలకు ఎలాంటి ప్రణాళికలు లేవని పాక్ ప్రకటించింది.


