News January 11, 2025

రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే..

image

ODIల్లో రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలవనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్‌లు), సచిన్ (276 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్‌లలో 10,866 రన్స్ చేశారు. నెక్స్ట్ 19 ఇన్నింగ్స్‌లలో 134 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరుకుంటే సచిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తారు.

Similar News

News July 5, 2025

ఒక టెస్టులో అత్యధిక పరుగులు వీరివే

image

* గ్రాహం గూచ్(ENG)- 456(333, 123)
* శుభ్‌మన్ గిల్(IND)-430(269, 161)
* మార్క్ టేలర్(AUS)-426(334, 92)
* సంగక్కర(SL)-424(319, 105)
* బ్రియన్ లారా(WI)-400(ఒకే ఇన్నింగ్సు)
* గ్రెగ్ చాపెల్(AUS)-380(247, 133)
* హేడెన్(AUS)-380(ఒకే ఇన్నింగ్సు)
* సందమ్(ENG)-375(325, 50)

News July 5, 2025

భారత్ డిక్లేర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 427/6 వద్ద ఉన్నప్పుడు కెప్టెన్ గిల్ డిక్లేర్ ప్రకటించారు. ప్రస్తుతం భారత్ 607 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ (161), రాహుల్ (55), పంత్ (65) జడేజా (69*) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మరికాసేపట్లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించనుంది.

News July 5, 2025

DECLARE ఇవ్వరా? కెప్టెన్ మదిలో ఏముంది?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ఆధిక్యం 565 పరుగులు దాటింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. రేపు ఒక రోజు మాత్రమే ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేట్‌గా డిక్లేర్ ఇస్తే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఉందని చర్చించుకుంటున్నారు. భారత్ మరీ ఆత్మరక్షణ ధోరణి కనబరుస్తోందని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మీ కామెంట్?