News January 26, 2025
అనర్హులకు పథకాలు వస్తే మధ్యలోనే ఆపేస్తాం: మంత్రి

TG: పథకాల కోసం అర్హులైన వారెవరూ రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్లో మంత్రి కొండా సురేఖతో కలిసి 4 పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పథకాల కోసం కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. అనర్హులకు లబ్ధి చేకూరినట్లు తేలితే వారికి మధ్యలోనే పథకాలను ఆపేస్తామన్నారు. త్వరలో ఇంటింటికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
బిహార్ ఎలక్షన్స్: ALL TIME RECORD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదయింది. ఫేజ్-1(65.08%), ఫేజ్-2(68.76%) కలిపి ఈసారి మొత్తం 66.91% ఓట్లు పోలయ్యాయి. 1951లో తొలి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మహిళల ఓటింగ్లోనూ ఈసారి రికార్డు స్థాయిలో 71.6% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనుండగా ఎగ్జిట్ పోల్స్ NDAకే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి..
News November 11, 2025
ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదా?

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదని, భయాందోళనలో తొందరపడి చేసిన దాడిగా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ANI పేర్కొంది. ‘టెర్రర్ నెట్వర్క్స్పై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడిలో ఇలా చేసి ఉండొచ్చు. నిందితుడు రెగ్యులర్ సూసైడ్ బాంబింగ్ పాటర్న్ ఫాలో కాలేదు. ఇంటెన్షనల్గా దేనిని ఢీకొనలేదు. పూర్తిగా డెవలప్ కాని బాంబును వాడటంతో తీవ్రత తగ్గింది’ అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.
News November 11, 2025
జూబ్లీహిల్స్లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్గూడ, రహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.


