News January 26, 2025
అనర్హులకు పథకాలు వస్తే మధ్యలోనే ఆపేస్తాం: మంత్రి

TG: పథకాల కోసం అర్హులైన వారెవరూ రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో మంత్రి కొండా సురేఖతో కలిసి 4 పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పథకాల కోసం కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. అనర్హులకు లబ్ధి చేకూరినట్లు తేలితే వారికి మధ్యలోనే పథకాలను ఆపేస్తామన్నారు. త్వరలో ఇంటింటికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 11, 2025
‘మద్యం’పై మాట తప్పిన ప్రభుత్వాలు.. మీరేమంటారు?

తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరల పెంపుపై మందుబాబులు ఫైరవుతున్నారు. APలో మద్యం ధరలు పెంచబోమని, తగ్గిస్తామని CM CBN, కూటమి నేతలు చెప్పి ఇప్పుడేమో బాటిల్‌పై రూ.10 పెంచారని మండిపడుతున్నారు. TGలో బీర్ల కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించబోమని, రేట్లు పెంచేది లేదని JANలో CM రేవంత్ ప్రకటించారు. నెల తిరక్కుండానే 15% పెంచి మాట తప్పారని దుయ్యబడుతున్నారు. ఈ అంశంపై మీ కామెంట్ ఏంటి?
News February 11, 2025
ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.22,507 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
News February 11, 2025
మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? ఇలా చేయండి!

ఇన్‌స్టా వాడే పిల్లలు, టీనేజర్ల కోసం ‘మెటా’ ఇండియాలో టీన్ ఖాతాలను ప్రవేశపెట్టింది. ఇందులో పిల్లలకు అసభ్యకర పోస్టులు, సెన్సిటివ్ కంటెంట్ కనిపించకుండా, అధునాతన సెక్యూరిటీతో ప్రైవసీ ఉంటుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో కఠినమైన ప్రైవసీ సెట్టింగ్స్, కంటెంట్ గోప్యతా సెట్టింగ్‌లు, కంటెంట్ కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి. 16ఏళ్లలోపు వారు ఈ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పటికే ఉంటే అది టీన్ ఖాతాలోకి మారిపోతుంది.