News May 10, 2024

అలాగైతే.. YCP, TDP ఒకే కూటమిలోకి?

image

AP: రాష్ట్రంలో బద్ద శత్రువుల్లాంటి YCP, TDP ఒకే కూటమిలో చేరడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును.. అలా జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే BJP ఎంపీ సీట్ల కోసం TDP, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడింది. అయితే.. కేంద్రంలో NDA కూటమికి మెజారిటీ సీట్లు రాకపోతే.. YCPని తమతో చేర్చుకోవడం కాషాయపార్టీకి పెద్ద కష్టమేం కాకపోవచ్చు. YCP, TDP అధికారికంగా NDA కూటమిలో చేరినా.. చేరకపోయినా.. మద్దతైతే ఇచ్చే వీలుంది. <<-se>>#Elections<<>>

Similar News

News December 19, 2025

మంచి ఆదాయ మార్గం.. రాజశ్రీ కోళ్ల పెంపకం

image

రాజశ్రీ కోళ్లు అధిక రోగ నిరోధక శక్తిని కలిగి తీవ్రమైన వ్యాధులను సైతం తట్టుకుంటాయి. ఇవి తక్కువ సమయంలో అధిక బరువు పెరుగుతాయి. కేవలం 8 వారాల వయసులోనే 500 గ్రాముల బరువు, 20 వారాల వ్యవధిలో రెండున్నర కిలోల వరకు బరువు పెరుగుతాయి. 160 రోజుల వ్యవధిలో గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏడాదికి 160-180 గుడ్లు పెడతాయి. మాంసం, గుడ్లు రెండింటి కోసం పెంచేవాళ్లకు రాజశ్రీ మంచి ఎంపిక అంటున్నారు వెటర్నరీ నిపుణులు.

News December 19, 2025

గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్: కపిల్ దేవ్

image

టీమ్ ఇండియాకు గంభీర్‌ మేనేజర్ మాత్రమేనని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. ‘కోచ్ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్ అంతే. లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్‌కు గంభీర్ కోచ్ ఎలా అవుతారు. స్కూల్, కాలేజీల్లో నేర్పేవాళ్లు నా దృష్టిలో కోచ్. ఆటగాళ్ల బాగోగులు చూసుకోవడమే ప్రస్తుత కోచ్ పని. వాళ్లను ప్రోత్సహించి, స్ఫూర్తి నింపి, సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి’ అని చెప్పారు.

News December 19, 2025

సచివాలయాలు.. బదిలీల గడువు పొడిగింపు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల <<18316925>>స్పౌజ్ కేటగిరీ<<>> అంతర్‌జిల్లా బదిలీల గడువును ప్రభుత్వం ఈ నెల 22 వరకు పొడిగించింది. గత నెల 30లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావించినా అనివార్య కారణాలతో అధికారులు గడువును పొడిగించారు. భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉంటే బదిలీలకు అర్హులు. మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయి‌మెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.