News May 10, 2024

అలాగైతే.. YCP, TDP ఒకే కూటమిలోకి?

image

AP: రాష్ట్రంలో బద్ద శత్రువుల్లాంటి YCP, TDP ఒకే కూటమిలో చేరడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును.. అలా జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే BJP ఎంపీ సీట్ల కోసం TDP, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడింది. అయితే.. కేంద్రంలో NDA కూటమికి మెజారిటీ సీట్లు రాకపోతే.. YCPని తమతో చేర్చుకోవడం కాషాయపార్టీకి పెద్ద కష్టమేం కాకపోవచ్చు. YCP, TDP అధికారికంగా NDA కూటమిలో చేరినా.. చేరకపోయినా.. మద్దతైతే ఇచ్చే వీలుంది. <<-se>>#Elections<<>>

Similar News

News February 14, 2026

ఏపీ బడ్జెట్.. రంగాల వారీగా

image

☛ విద్యుత్-రూ.13,934 కోట్లు, ☛ పరిశ్రమలు-₹3,161కోట్లు,
☛ రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులు-₹13,546Cr,
☛ వీబీ జీ రామ్ జీ -₹8,365Cr, ☛ పోలవరం ₹6,105Cr
☛ తల్లికి వందనం ₹9,668Cr, ☛ మహిళా శిశు సంక్షేమం ₹4,581Cr
☛ గృహ నిర్మాణం-₹5,451Cr, ☛ ఎన్టీఆర్ వైద్య సేవ ₹4,000Cr
☛ జల్ జీవన్ ₹4,000Cr, ☛ స్వచ్ఛ్ భారత్ మిషన్ ₹1,037Cr, ☛ విశాఖ ఆర్థిక ప్రాంతానికి ₹28,000Cr , రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు ₹30,000Cr

News February 14, 2026

రూ.3.32లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

image

AP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868కోట్లుగా పేర్కొన్నారు. అమరావతికి రూ.6వేల కోట్లను కేటాయించారు.

News February 14, 2026

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* పూరీలు తెల్లగా ఉండాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* ఆలూతో కలిపి నిల్వచేస్తే వెల్లుల్లి తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోవు.