News August 26, 2024
రూ.30వేల స్పీకర్స్ బుక్ చేస్తే..!

FLIPKARTలో జరిగిన మోసాన్ని ఓ నెటిజన్ Xలో పంచుకున్నారు. నిఖిల్ అనే వ్యక్తి రూ.30వేలు విలువ చేసే SONOS స్పీకర్స్ బుక్ చేస్తే MI కంపెనీకి చెందిన రూ.2400ల స్పీకర్ డెలివరీ చేశారు. దీనిపై పలుమార్లు ఫ్లిప్‌కార్ట్‌కు ఫిర్యాదు చేసినా రెస్పాండ్ కాలేదని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు ఫ్లిప్‌కార్ట్ స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. అయితే, ఇలాంటిదే తమకూ జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News February 16, 2025
WPL: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ఆఖరి బంతికి అందుకుంది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ బాదారు. ఆ తర్వాతి 3 బంతులకు నాలుగు పరుగులు రాగా ఐదో బంతికి నిక్కీ ఔటయ్యారు. చివరి బంతికి అరుంధతి రెండు పరుగులు తీసి ఢిల్లీకి విజయాన్ని అందించారు.
News February 16, 2025
మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్యపానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్(3.3%) ఉన్నాయి. గతంలో టాప్‌లో ఉన్న ఝార్ఖండ్(9.9%), త్రిపుర(9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.
News February 16, 2025
OTTలోకి వచ్చేసిన కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

కిచ్చా సుదీప్ నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం DEC 25న విడుదలై దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.