News April 28, 2024

శ్రీరాముడిని అడిగితే బండి సంజయ్‌కి ఓటేయొద్దంటాడు: KTR

image

TG: BJP MP బండి సంజయ్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన KTR.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ పరస్పర అవగాహనతో ఉన్నారని ఆరోపించారు. బండికి జైశ్రీరామ్ అనడం ఒక్కటే తెలుసని, ఒకవేళ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సంజయ్‌కు ఓటు వేయవద్దని చెబుతాడని ఎద్దేవా చేశారు.

Similar News

News November 24, 2025

314 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా

image

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు <<18375894>>ఆలౌటైంది<<>>. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన RSA ఆట ముగిసే సమయానికి 26/0 రన్స్ చేసింది. బవుమా సేన 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.

News November 24, 2025

ధర్మేంద్ర ఆస్తి ఎంతో తెలుసా?

image

బాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరిగా వెలుగొందిన ధర్మేంద్ర అనారోగ్య కారణాలతో మరణించారు. ఆయన ఆస్తి విలువ రూ.335-450 కోట్ల మధ్య ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంది. సినిమాలు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల ద్వారా ఇంత మొత్తం ఆర్జించినట్లు తెలిపింది. ముంబై-పుణె మధ్యలో ఉండే లోనావాలాలో 100 ఎకరాల ఫాంహౌజ్ ఉందని పేర్కొంది. ఆయన సోషల్ మీడియా అకౌంట్‌లో ఎక్కువగా ఈ ఫౌంహౌజ్‌లో చేసే వ్యవసాయం వీడియోలను పోస్ట్ చేయడం గమనార్హం.

News November 24, 2025

గులాబీ తోటల్లో చీడపీడల ముప్పు

image

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్‌ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.