News October 15, 2024
TECH NECK రాకూడదంటే..
* రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయాలి * కూర్చునే పోస్చర్ సరిచేసుకోవాలి * ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వాడకం తగ్గించాలి * ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల స్క్రీన్లను తలను వంచకుండా స్ట్రెయిట్‌గా చూడాలి * వాటిని కళ్లకు 20-30 ఇంచుల దూరంలో ఉంచుకోవాలి * తల, వెన్నెముక, హిప్స్ నిటారుగా ఉండేలా కూర్చోవాలి * కూర్చున్నప్పుడు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉంచాలి * కుర్చీలో కూర్చుంటే మీ పాదాలు నేలకు సమాంతరంగా తాకాలి
Similar News
News November 12, 2024
RGVపై మరో ఫిర్యాదు
డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌పై ఆయన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. గేదెల ముఖాలకు వీరి ఫొటోలను పెట్టి అవమానించారని పేర్కొన్నారు. ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై <<14581839>>కేసు నమోదైన<<>> విషయం తెలిసిందే.
News November 12, 2024
STOCK MARKETS: రియాల్టి షేర్ల జోరు
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. క్షణాల్లోనే పెరుగుతూ తగ్గుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, CPI డేటా రావాల్సి ఉండటమే ఇందుకు కారణాలు. సూచీల గమనం తెలియకపోవడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 79,582 (+86), నిఫ్టీ 24,166 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, ఐటీ, మీడియా, హెల్త్‌కేర్ షేర్లు పెరిగాయి. ఆటో, FMCG సూచీలు తగ్గాయి.
News November 12, 2024
చినాబ్ రైల్వే బ్రిడ్జిపై మాక్ డ్రిల్
J&Kలోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై ఇవాళ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలనేది చేసి చూపించాయి. SOG, CRPF 126bn, GRP, RPF, SDRF, ఫైర్&ఎమర్జెన్సీ, మెడికల్ బృందాలు డ్రిల్‌లో పాల్గొన్నాయి. నదీ గర్భం నుంచి 359M ఎత్తులో 1,315M పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిపై 4 నెలల కిందట రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.