News November 30, 2024
అలా జరిగితే రామ మందిరంలోకి రావొద్దు: ట్రస్ట్ సభ్యుడు

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామాలయ పూజారుల కుటుంబాల్లో ఏవైనా జనన, మరణాలతో మలినపడిన పూజారికి రామమందిర ప్రవేశం పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న పూజారులు నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. చలికాలంలో కాషాయరంగులోని ఉన్ని దుస్తులు ధరించవచ్చన్నారు. అవసరాన్ని బట్టి బేసిక్ ఫోన్ వాడుకోవచ్చని తెలిపారు.
Similar News
News December 5, 2025
PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
News December 5, 2025
పండ్లు, కూరగాయలు తినే ముందు ఇది గుర్తుంచుకోండి

వ్యవసాయంలో అధిక దిగుబడి, చీడపీడల నివారణ కోసం ఈ మధ్యకాలంలో పంటలపై క్రిమిసంహారకాలు, కలుపు మందుల వాడకం ఎక్కువైంది. పంటకాలం పూర్తై, విక్రయించిన తర్వాత కూడా పురుగు మందుల అవశేషాలు పండ్లు, కూరగాయల నుంచి తొలగిపోవు. అందుకే మనం తినే ముందు వీటిని తప్పనిసరిగా శుభ్రం చేసి తినాలి. లేకుంటే ఈ అవశేషాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరితే క్యాన్సర్, గుండె జబ్బులు, అంగ వైకల్యం లాంటి సమస్యలు తలెత్తే ఛాన్సుంది.
News December 5, 2025
102 ఉద్యోగాలకు నోటిఫికేషన్

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 102 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ మార్క్స్&జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఎగ్జామినర్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్&ట్రేడ్ మార్క్స్ కార్యాలయం, ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్లో 100 పోస్టులు, UPSCలో 2 డిప్యూటీ డైరెక్టర్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి జనవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్: https://upsc.gov.in


