News November 30, 2024

అలా జరిగితే రామ మందిరంలోకి రావొద్దు: ట్రస్ట్ సభ్యుడు

image

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామాలయ పూజారుల కుటుంబాల్లో ఏవైనా జనన, మరణాలతో మలినపడిన పూజారికి రామమందిర ప్రవేశం పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న పూజారులు నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. చలికాలంలో కాషాయరంగులోని ఉన్ని దుస్తులు ధరించవచ్చన్నారు. అవసరాన్ని బట్టి బేసిక్ ఫోన్ వాడుకోవచ్చని తెలిపారు.

Similar News

News December 4, 2024

అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష: హోంమంత్రి

image

AP: విధినిర్వహణలో ప్రమాదవశాత్తు/ఆకస్మికంగా/అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమి ప్రభుత్వం మూడు రెట్లు పెంచింది. వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత X వేదికగా వెల్లడించారు.

News December 4, 2024

ఉద్యోగాల్లో రోబోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉన్న దేశం ఇదే!

image

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో రోబోల వినియోగం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో ఇవి అత్యధిక సంఖ్యలో వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఇక్కడ ప్రతి 10వేల మంది ఉద్యోగులకు 1,102 రోబోలు ఉన్నాయి. 2008 నుంచి పోల్చితే వీటి వినియోగం 5శాతం పెరిగింది. ఈ దేశం రోబోటిక్స్ వైపు మళ్లడంతో పనుల్లో మానవ శ్రమ తగ్గి ఉత్పాదకత పెరిగింది.

News December 4, 2024

‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్‌గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన ‘సీజ్ ద షిప్’ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ వాక్యం వైరలవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు.