News February 9, 2025
జైలుకెళ్లొస్తే సీఎం.. బ్రేక్ అయిన సెంటిమెంట్

జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, హేమంత్ సోరెన్ జైలుకెళ్లొచ్చారు. ముఖ్యమంత్రులయ్యారు. దీంతో జైలుకెళ్లి తిరిగిరాగానే సీఎం అయిపోవడం ఖాయం అన్న ఓ సెంటిమెంట్ నెలకొంది. కానీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన మాజీ సీఎం కేజ్రీవాల్ మాత్రం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు. జైలుకెళ్తే సీఎం అన్న సెంటిమెంట్ ఢిల్లీ ఎన్నికల్లో బ్రేక్ అయిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Similar News
News March 19, 2025
శుభ ముహూర్తం (19-03-2025)

☛ తిథి: బహుళ పంచమి రా.8.58 వరకు తదుపరి షష్టి ☛ నక్షత్రం: విశాఖ సా.5.44 వరకు తదుపరి అనురాధ☛ శుభ సమయం: లేదు ☛ రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు ☛ యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు ☛ దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు ☛ వర్జ్యం: రా.10.05నుంచి 11.49వరకు ☛ అమృత ఘడియలు: ఉ.7..52 నుంచి 9.39 వరకు
News March 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 19, 2025
యుద్ధం ముగింపుకు అంగీకరించిన పుతిన్ : వైట్‌హౌస్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్‌లో చర్చలు జరిపారు. ఈమేరకు యుద్ధానికి స్వస్థి పలకాలని విజ్ఞప్తి చేయగా పుతిన్ అంగీకరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. గత కొంతకాలంగా యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.