News October 2, 2024

నేతలకు దమ్ముంటే మా నీళ్లు తాగాలి: హరియాణాలో ప్రజల సవాల్

image

హరియాణాలోని చార్ఖీ దాద్రీ నియోజకవర్గంలోని సమస్‌పూర్‌ ప్రజలు రాజకీయ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సరఫరా అయ్యే తాగునీరు కనీసం పశువులు కూడా తాగలేనంత మురికిగా ఉంటోందని, చాలాకాలంగా నీటిని కొని తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓట్లు అడిగేందుకు వచ్చే ఎవరైనా సరే తమ వద్ద నీటిని తాగాలంటూ సవాలు చేస్తున్నారు.

Similar News

News October 4, 2024

పాలనలో ఫెయిల్ కావడంతోనే బాబు టాపిక్ డైవర్ట్ చేశారు: జగన్

image

AP: చంద్రబాబు పాలనలో ఫెయిలవడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు లడ్డూ వివాదం సృష్టించారని జగన్ ఆరోపించారు. ‘JULY 23న లడ్డూ తయారీకి సంబంధించిన రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ అని చెప్పి సెప్టెంబర్ 18న తన 100 రోజుల పాలన మీద మాట్లాడుతూ ఈ రిపోర్ట్ గురించి చెప్పారు’ అని జగన్ అన్నారు. నెయ్యిలో కలిసింది జంతు కొవ్వు కాదని, అయినా దాన్ని తిరస్కరించామని TTD EO అంటుంటే బాబు అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

News October 4, 2024

IPL: వీరిని ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదల్లేదు

image

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఐదుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదులుకోలేదు. వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ-సీఎస్కే, విరాట్ కోహ్లీ-ఆర్సీబీ, సచిన్ టెండూల్కర్-ముంబై ఇండియన్స్, సునీల్ నరైన్-కేకేఆర్, రిషభ్ పంత్-డీసీ ఉన్నారు. వీరిలో ధోనీ మినహా అందరూ ఒకే జట్టుకు ఆడారు. IPL-2025 సీజన్‌కు కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకే ఆడతారని అంచనా. వీరి రిటెన్షన్లపై ఆయా ఫ్రాంచైజీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్.

News October 4, 2024

మోదీ డైరెక్షన్‌లో పవన్ నటన: షర్మిల

image

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. దీనిపై త్వరలోనే అఖిలపక్షంతో కలిసి సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పారు. ‘ప్రధాని మోదీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి పవన్‌కు లేదు. లడ్డూ వ్యవహారంపై స్పెషల్ సిట్‌ను ఆహ్వానిస్తున్నాం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.