News April 11, 2025
కేఎల్ ఉంటే ఖేల్ ఖతమే

DC బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఛేజింగ్ జట్టు గెలిచిన సందర్భాల్లో అత్యధిక యావరేజ్(71.05) కలిగిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్(103.70 యావరేజ్) టాప్‌లో ఉన్నారు. KL 25 ఇన్నింగ్సుల్లో 148.58 స్ట్రైక్ రేటుతో 1,208 రన్స్ చేశారు. ఇందులో 12 హాఫ్ సెంచరీలున్నాయి. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ రన్‌ఛేజ్ మ్యాచ్‌లలో మొత్తంగా 56 మంది 500+ పరుగులు చేశారు.
Similar News
News April 19, 2025
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే..

పురుషుల్లో ఒంటరితనం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో సంతానోత్పత్తి, గర్భాశయ సమస్యలు అధికమవుతాయి. లేటు మ్యారేజ్‌లో భాగస్వామితో గొడవలు, డివోర్స్ అవకాశాలు ఎక్కువట. మరోవైపు కుటుంబం, సమాజం నుంచి కూడా ప్రశ్నలు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. 30 ఏళ్లు దాటాక మనసుకు నచ్చకపోయినా వచ్చిన సంబంధాన్ని ఒప్పుకోక తప్పదు. రాజీపడాల్సి వస్తుంది.
News April 19, 2025
అనుకోకుండా బుల్లెట్ తగిలి ఇండియన్ స్టూడెంట్ స్పాట్ డెడ్

కెనడాలో జరిగిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. హామిల్టన్‌లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధవా ఒంటారియోలోని ఓ బస్టాప్ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వాహనంలోని వ్యక్తిపై కాల్పులు జరిపాడు. కానీ ఓ బుల్లెట్ మిస్సై హర్‌సిమ్రత్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
News April 19, 2025
ఫార్ములా ఈ-రేసు కేసు.. రెండో విడత దర్యాప్తు!

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో రెండో విడత దర్యాప్తు కోసం ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన అధికారులు, మరో 10 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించాలని నిర్ణయించారు. HMDA బోర్డు నిధుల నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.