News March 29, 2024
పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్

పురుషులలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇది మూత్రాశయం, సమీప అవయవాలకు వ్యాపిస్తుంది. దీనిని కొన్ని లక్షణాల ద్వారా ముందుగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మూత్ర ప్రవాహంలో ఇబ్బందులు, రాత్రి వేళల్లో ఎక్కువగా యూరిన్ రావడం, యూరినేషన్ సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి తీవ్రమైన వారి కాళ్లలో వాపు కనిపిస్తుందట.
Similar News
News February 16, 2026
జీడిమామిడిలో అంతర పంటలు.. లాభాలు

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్‌ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.
News February 16, 2026
ఉపవాసం విరమించే ముందు..

ఉపవాసాన్ని విరమించే ముందు ఇంట్లో శివునికి నైవేద్యం సమర్పించాలి. అలాగే దీపారాధన కూడా చేయాలి. వీలైతే పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అన్నదానం తర్వాత ఉపవాసం విరమిస్తే వచ్చే పుణ్యం అనంతం. పారణ చేసేటప్పుడు ‘ఓం నమః శివాయ’ మంత్రం జపించాలని పండితులు సూచిస్తున్నారు. భగవంతునిపై మనసు లగ్నం చేసిన తర్వాత పాటించే ఈ పరిహారాలు అనంత పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే విరమణ తర్వాత కూడా ప్రశాంతంగా, భక్తితో ఉండాలి.
News February 16, 2026
ఇంటర్వ్యూతో CDRIలో ఉద్యోగాలు

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (C<


