News May 10, 2024
ఈవీఎంలో ఆ బటన్లు నొక్కితే?

ఒక ఈవీఎంలో 16 బటన్లు ఉంటాయి. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను బట్టి వీటిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో కేవలం 10 మందే బరిలో ఉంటే వారికి ఒకటి నుంచి పది వరకు బటన్లు కేటాయిస్తారు. మిగిలిన బటన్లను పనిచేయకుండా అధికారులు లాక్ చేస్తారు. అలాగే బ్యాలెట్ యూనిట్లోని బటన్ను ఒకసారి నొక్కిన వెంటనే మీ ఓటు నమోదవుతుంది. ఆ వెంటనే ఈవీఎం లాక్ అవుతుంది. మళ్లీ ఎన్నిసార్లు నొక్కినా ఓటు తీసుకోదు.
Similar News
News November 13, 2025
రండి.. ట్రైనింగ్ ఇచ్చి వెళ్లిపోండి: అమెరికా

H1B వీసా విధానంపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సంచలన కామెంట్లు చేశారు. ‘విదేశాల నుంచి వచ్చే వారిపై ఎక్కువ కాలం ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం తాత్కాలికంగా విదేశీ కార్మికులను యూఎస్ తీసుకురావడమే H1B వీసా కొత్త విధానం. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి. తరువాత తిరిగి వెళ్లిపోండి. జాబ్స్ అన్నీ అమెరికన్లే తీసుకుంటారు’ అని చెప్పారు.
News November 13, 2025
టెన్త్ పరీక్షలు అప్పుడేనా?

TGలో పదో తరగతి పరీక్షలు 2026 మార్చి 18(బుధవారం) నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు అదే రోజు ముగియనుండగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ప్రభుత్వం ఆమోదిస్తే 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అటు టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని TGHMA విద్యాశాఖను కోరింది.
News November 13, 2025
భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.


