News May 10, 2024
ఈవీఎంలో ఆ బటన్లు నొక్కితే?

ఒక ఈవీఎంలో 16 బటన్లు ఉంటాయి. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను బట్టి వీటిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో కేవలం 10 మందే బరిలో ఉంటే వారికి ఒకటి నుంచి పది వరకు బటన్లు కేటాయిస్తారు. మిగిలిన బటన్లను పనిచేయకుండా అధికారులు లాక్ చేస్తారు. అలాగే బ్యాలెట్ యూనిట్‌లోని బటన్‌ను ఒకసారి నొక్కిన వెంటనే మీ ఓటు నమోదవుతుంది. ఆ వెంటనే ఈవీఎం లాక్ అవుతుంది. మళ్లీ ఎన్నిసార్లు నొక్కినా ఓటు తీసుకోదు.
Similar News
News February 14, 2025
స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

AP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ వేస్ట్ కలక్షన్స్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, క్లీన్ విలేజ్, సహా పలు అంశాలకు పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. 200 పాయింట్లకు 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో, 81 పాయింట్లతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచాయి.
News February 14, 2025
ఏ జిల్లాకు ఏ ర్యాంక్ వచ్చింది?

AP: ఎన్టీఆర్-1, విశాఖ-2, ఈస్ట్ గోదావరి-3, అనంతపురం-4, అన్నమయ్య-5, శ్రీకాకుళం-6, కడప-7, గుంటూరు-8, బాపట్ల-9, నెల్లూరు-10లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ గోదావరి, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, కోనసీమ, మన్యం, శ్రీ సత్యసాయి, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, విజయనగరం, చిత్తూరు, అల్లూరి జిల్లాలు ఉన్నాయి.
News February 14, 2025
TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.