News January 24, 2025
2022లో ట్రంప్ ఉంటే యుద్ధమే ఉండేది కాదు: పుతిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది.
Similar News
News January 25, 2025
నేడు నలుగురు ఇజ్రాయెల్ బందీల విడుదల
ఇజ్రాయెల్ మహిళా బందీలు నలుగురిని నేడు విడిచిపెడుతున్నట్లు హమాస్ స్పష్టం చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవీ, లిరి అల్బాగ్ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. గత శనివారం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా, తొలి విడతగా ఆదివారం ముగ్గురు బందీలను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిఫలంగా ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
News January 25, 2025
దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్
AP: దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని సీఎం వారితో చెప్పారు. ఆ సమయంలో పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్కు చంద్రబాబు సూచించారు.
News January 25, 2025
MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.