News January 24, 2025
2022లో ట్రంప్ ఉంటే యుద్ధమే ఉండేది కాదు: పుతిన్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది.
Similar News
News February 12, 2025
సంక్షేమ పథకాల వల్ల కార్మికుల కొరత: L&T ఛైర్మన్

సంక్షేమ పథకాల వల్ల కార్మికుల కొరత ఏర్పడిందని L&T కంపెనీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. DBT వల్ల పనులు చేసేందుకు, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపట్లేదన్నారు. దీంతో వారిని నియమించుకోవడానికి కంపెనీలు చాలా కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమీకరణ, నియామకాల కోసం తమ కంపెనీ HR టీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
News February 12, 2025
నేటి నుంచి ఆధ్యాత్మిక పర్యటన.. బేగంపేట్ చేరుకున్న పవన్

AP Dy.CM పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆధ్యాత్మిక పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందట HYDలోని బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయన 4రోజులపాటు కేరళ, తమిళనాడులో పర్యటించనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధురై మీనాక్షి, పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, తదితర ఆలయాలను సందర్శించనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడిన పవన్ కోలుకొని ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తున్నారు.
News February 12, 2025
టాయిలెట్‌లోకి ఫోన్ తీసుకెళ్తే..

టాయిలెట్లలో ఫోన్ వాడటం శారీరకంగా, మానసికంగా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల విసర్జన అవయవాలపై ఒత్తిడి పడుతుందని, రక్త ప్రసరణ నెమ్మదిస్తుందని తెలిపారు. రక్తనాళాలు ఉబ్బి పైల్స్, ఫిషర్స్‌కు దారి తీస్తుంది. టాయిలెట్‌లోని ప్రమాదకర బ్యాక్టీరియాలు, క్రిములు స్క్రీన్‌పై చేరి అతిసారం, కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు వస్తాయి.
Share it