News September 14, 2024

రేవంత్‌ను విమర్శిస్తే నాలుక కోస్తాం: జగ్గారెడ్డి

image

TG: సీఎం రేవంత్‌ను విమర్శిస్తే నాలుక కోస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి BRS నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అరెకపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి వివాదం BRS పార్టీకి సంబంధించిన పంచాయితీ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ, తమ జోలికి వస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ప్రశాంతంగానే ఉందని, పోలీసులు BRS నేతలను పట్టించుకోవాలా? ప్రజలను పట్టించుకోవాలా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Similar News

News October 9, 2024

నైజాంలో ఆల్‌ టైమ్ టాప్-5లోకి ‘దేవర’

image

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ నైజాం ఆల్‌టైమ్ కలెక్షన్ల జాబితాలో 5వ స్థానానికి చేరింది. 12 రోజుల్లోనే ఈ సినిమా రూ.56.07 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇక తొలి నాలుగు స్థానాల్లో మూడు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. అగ్రస్థానంలో RRR(రూ.111.85 కోట్లు) ఉంది. తర్వాతి 3 స్థానాల్లో వరసగా కల్కి 2898ఏడీ(రూ.92.80 కోట్లు), సలార్(రూ.71.40 కోట్లు), బాహుబలి 2(రూ.68 కోట్లు) ఉన్నాయి.

News October 9, 2024

అమ్మవారికి పూల దండ.. వేలంలో ఎంత పలికిందంటే!

image

AP: దసరా సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ఆనవాయితీ నడుస్తుంటుంది. అంబేడ్కర్ కోనసీమ(D) అమలాపురంలోని రమణం వీధిలో ఏటా అమ్మవారి మెడలో వేసే పూల దండకు వేలం పాట నిర్వహిస్తారు. ఈసారి ఓ భక్తుడు రూ.లక్షా మూడు వేలకు పూల దండను దక్కించుకున్నారు. అమ్మవారి మెడలో దండ వేస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 12 ఏళ్ల క్రితం తొలిసారి వేలంపాటలో పూల దండ రూ.5వేలు పలికింది.

News October 9, 2024

దసరా: స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంపు!

image

TG: దసరా పండుగకు నడుపుతున్న TGSRTC స్పెషల్ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణ ఛార్జీల కంటే 25% వరకు అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.310గా ఉంటే ఇప్పుడు రూ.360 తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారిక ప్రకటన చేయలేదు.