News February 6, 2025
పాక్‌పై ఓడితే గుచ్చి గుచ్చి అడుగుతారు: రవి శాస్త్రి

భారత్-పాక్ మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని, అన్ని మ్యాచుల్లాగే దాన్నీ పరిగణిస్తామన్న కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘కోచ్‌గా ఉన్నప్పుడు నేనూ మీడియాకు ఇదే మాట చెప్పేవాడిని. కానీ నిజమేంటంటే పాక్‌పై గెలవడం చాలా కీలకం. ఆ జట్టుపై ఎన్ని మ్యాచులు గెలిచినా ఒక్క మ్యాచ్ ఓడితే చాలు పాతవన్నీ మర్చిపోయి ఓటమి గురించే అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 25, 2025
UNSUNG HERO: అరంగేట్రంలోనే నిగమ్ సంచలనం

ఐపీఎల్ అరంగేట్రంలోనే విప్రాజ్ నిగమ్ సంచలన ఇన్నింగ్స్ ఆడారు. ఢిల్లీ 113 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నిగమ్ 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు బాది సమీకరణాలు మార్చేశారు. LSGపై DC సంచలన విజయంలో అశుతోశ్ శర్మకు ఎంత క్రెడిట్ ఉందో 20 ఏళ్ల నిగమ్‌కూ అంతే ఉంది. అందరూ అశుతోశ్‌ను పొగుడుతున్నారు కానీ నిగమ్‌ను మాత్రం మరిచిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
News March 25, 2025
‘దంగల్’ చేసేందుకు ఇష్టపడలేదు: ఆమిర్ ఖాన్

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా రూ.2000+ కోట్లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చేసేందుకు తాను మొదట్లో ఇష్టపడలేదని ఆమిర్ వెల్లడించారు. ‘నా కెరీర్‌ను ముగించడానికే సల్మాన్ & షారుఖ్‌లు ఈ స్క్రిప్ట్‌తో డైరెక్టర్‌ను నా దగ్గరకు పంపించారేమోనని భావించా’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చమత్కరించారు.
News March 25, 2025
బంగ్లాలో సైనిక తిరుగుబాటు?

బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూనస్ పట్ల బంగ్లా సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, 8మంది మేజర్ జనరల్స్, కమాండర్స్, కీలక అధికారులతో ఆర్మీ చీఫ్ వకెర్-ఉజ్-జమాన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించడంతో తిరుగుబాటు వార్తలు ఊపందుకున్నాయి.