News May 24, 2024
ముస్లిం రిజర్వేషన్లపై మళ్లీ మాట్లాడితే దావా వేస్తా: షబ్బీర్

TG: బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తాజాగా ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని, వాటిని తొలగిస్తామని పీఎం మోదీ ఎలా అంటారని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రధాని మళ్లీ మాట్లాడితే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మైనారిటీల రిజర్వేషన్ పేదరికం ప్రాతిపదికన మాత్రమే ఇచ్చారని అలీ తేల్చిచెప్పారు.
Similar News
News February 10, 2025
13 ఏళ్లుగా ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వరుసగా POTM అవార్డు అందుకున్న ప్లేయర్‌గా నిలిచారు. 2013 నుంచి 2025 వరకు ఏటా కనీసం ఒక మ్యాచ్‌లో అయినా హిట్‌మ్యాన్ ఈ అవార్డు అందుకుంటున్నారు. నిన్న ఇంగ్లండ్‌పై 90 బంతుల్లో 119 రన్స్ చేసిన రోహిత్ విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.
News February 10, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

మలయాళ నటుడు అజిత్ విజయన్(57) కన్నుమూశారు. తన నివాసంలో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒరు ఇండియన్ ప్రణయకథ, బెంగళూరు డేస్, అమర్ అక్బర్ అంథోని, అంజు సుందరికల్ తదితర సినిమాల్లో ఆయన నటించారు. ఆయన మృతిపై మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
News February 10, 2025
ఇండియా కూటమిలో ఉండాలా వద్దా: ఆప్ సందిగ్ధం

ఢిల్లీ ఓటమితో ఆమ్‌ఆద్మీ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఒకవైపు పంజాబ్‌లో పార్టీ చీలిపోతుందేమోనని భయం. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, అవధ్ ఓజా, సత్యేందర్ జైన్ అడుగుపెట్టలేని పరిస్థితి. పార్టీని ఆతిశీ టేకోవర్ చేస్తారేమోనన్న ఆందోళన. వీటన్నిటి నడుమ ఇండియా కూటమిలో కొనసాగాలో లేదో తేల్చుకోలేని పరిస్థితిలో ఆప్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిని వీడొచ్చని వారి అంచనా.