News March 30, 2024

మేం తలచుకుంటే 60మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి: ఈటల

image

తాము తలచుకుంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి 60మంది ఎమ్మెల్యేలను చేర్చుకోగలమని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌తో మా ఎమ్మెల్యేలు 8మంది టచ్‌లో ఉంటే, మాకు 60మంది కాంగ్రెస్ వాళ్లను తీసుకోవడం పెద్ద విషయం కాదు. కేసీఆర్‌ తరహాలోనే రేవంత్ సర్కారు కూడా నేతల్ని కొంటోంది. వారు వచ్చి 100 రోజులు దాటింది. హామీల్ని ఎందుకు నెరవేర్చడం లేదు?’ అని ప్రశ్నించారు.

Similar News

News November 6, 2024

KTR ఆరోపణలపై స్పందించిన జలమండలి

image

TG: సుంకిశాల కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని KTR చేసిన ఆరోపణలపై వాటర్ బోర్డు స్పందించింది. ఆ ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. సుంకిశాల గోడ కూలడంపై విచారణకు కమిటీ వేశామని తెలిపింది. అటు నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేకపోయిన కాంట్రాక్టు సంస్థకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వివరించింది. విచారణ తర్వాత చర్యలుంటాయంది.

News November 6, 2024

పవన్ కళ్యాణ్ తనయుడికి నటనలో శిక్షణ మొదలు?

image

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కి నటనలో శిక్షణ మొదలైనట్లు సమాచారం. తన గురువు సత్యానంద్ వద్దే కుమారుడికీ శిక్షణ ఇప్పించాలని పవన్ భావించినట్లు తెలుస్తోంది. ఈరోజే అకీరా శిక్షణలో చేరారని, కొన్ని నెలల పాటు నటనలో మెలకువలు నేర్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పవన్ క్రమేపీ సినిమాలకు దూరమవుతున్న నేపథ్యంలో అకీరా ఇండస్ట్రీలోకి రానుండటంపై ఆయన ఫ్యాన్స్ నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

News November 6, 2024

అలా చేస్తే 10-14 ఏళ్లు జైలు శిక్ష: మంత్రి

image

AP: రాష్ట్ర చరిత్రలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములకు కొత్తగా తెచ్చే ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించినట్లు చెప్పారు. జగన్ పాలనలో వైసీపీ గుండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.