News March 30, 2024
మేం తలచుకుంటే 60మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి: ఈటల
తాము తలచుకుంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి 60మంది ఎమ్మెల్యేలను చేర్చుకోగలమని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్తో మా ఎమ్మెల్యేలు 8మంది టచ్లో ఉంటే, మాకు 60మంది కాంగ్రెస్ వాళ్లను తీసుకోవడం పెద్ద విషయం కాదు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ సర్కారు కూడా నేతల్ని కొంటోంది. వారు వచ్చి 100 రోజులు దాటింది. హామీల్ని ఎందుకు నెరవేర్చడం లేదు?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 24, 2025
ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్య నిషేధం
మధ్యప్రదేశ్(MP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ సహా 17 ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను సీఎం నొక్కి చెప్పారు. కాగా గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంది.
News January 24, 2025
RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ
AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సీపీ కీలక వ్యాఖ్యలు
TG: మీర్పేట్లో భార్యను <<15227723>>దారుణంగా హత్య చేసిన ఘటన<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇది మిస్సింగ్ కేసుగానే ఉందని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులతోనూ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.