News March 12, 2025

చనిపోయిందనుకొని ఖననం చేస్తే.. చివరికి.!

image

మరణించిందని భావించి పూడ్చిపెట్టిన మహిళ తిరిగి లేచిన ఘటన USలో జరిగింది. 1915లో ఎస్సీ విలియమ్స్ మూర్ఛ వ్యాధితో చనిపోయిందనుకొని అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే, అంత్యక్రియలకు ఆలస్యంగా వచ్చిన తన సోదరి చివరి చూపు చూస్తానని శవపేటికను తెరవాలని కోరారు. దీంతో తవ్వి పేటిక తెరవగా ఆమె లేచి కూర్చొని నవ్వుతూ కనిపించారు. అది చూసిన వారంతా భయంతో పారిపోయారు. ఆ తర్వాత ఆమె మరో 47ఏళ్లు జీవించడం గమనార్హం.

Similar News

News February 2, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 02, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.26 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 2, 2026

చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించేది లేదు: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినీ వదలి పెట్టమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘ఏపీ రాజకీయాలను నేరమయం చేసిన సంస్కృతి వైసీపీదే. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రతిపక్షం తట్టుకోలేకపోతోంది. ఆ పార్టీ పాలన అంతా చట్టరహితంగా సాగింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిబంధనలు అందరికీ ఒకటే’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

News February 2, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.