News February 16, 2025
100 లేదా 112కు కాల్ చేస్తే నిమిషాల్లో కాపాడతాం: డీజీపీ గుప్తా

AP: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని DGP హరీశ్ గుప్తా తెలిపారు. నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. ‘నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు కట్టుబడి ఉన్నాం. అలాగే పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. నేరాలను అరికట్టడంలో సమాజం బాధ్యత తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News December 14, 2025
24 గంటల్లోనే అకౌంట్లలోకి డబ్బులు: టీడీపీ ఎమ్మెల్యే

AP: 2025-26 ఖరీఫ్ సీజన్లో ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు TDP ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. 3.24 లక్షల రైతుల ఖాతాల్లో రూ.4,609 కోట్లు జమ చేయడం ఓ రికార్డని చెప్పారు. 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది రూ.12,200 కోట్ల విలువైన 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
News December 14, 2025
మత్తు ఇంజెక్షన్తో నడుం నొప్పి వస్తుందా?

సీ సెక్షన్ డెలివరీ చేసేటప్పుడు మహిళలకు మత్తు ఇంజెక్షన్(అనస్థీషియా) ఇస్తారు. అయితే ఈ సూదిని వెన్నెముకకు ఇస్తారని, దీనివల్ల నడుంనొప్పి వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ ఇది అపోహే అంటున్నారు వైద్యులు. ఈ ఇంజెక్షన్ నేరుగా వెన్నెముకలోని ఎముకకు ఇవ్వరని చెబుతున్నారు. డెలివరీ తర్వాత వీపు వెనుక ఎలాంటి సపోర్ట్ లేకుండా పాలివ్వడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల నడుం నొప్పి వస్తుందంటున్నారు.
News December 14, 2025
‘నల్లమల సాగర్’పై సుప్రీంలో ఏపీ కేవియట్!

AP: పోలవరం-నల్లమల సాగర్ సాగునీటి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుగానే కేవియట్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్కు అప్పగించింది. కాగా ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి రెండు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. L1గా వచ్చిన సంస్థకు బాధ్యతలు అప్పగిస్తారు.


