News February 16, 2025
100 లేదా 112కు కాల్ చేస్తే నిమిషాల్లో కాపాడతాం: డీజీపీ గుప్తా

AP: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని DGP హరీశ్ గుప్తా తెలిపారు. నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. ‘నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు కట్టుబడి ఉన్నాం. అలాగే పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. నేరాలను అరికట్టడంలో సమాజం బాధ్యత తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
News March 24, 2025
పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్‌సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
News March 24, 2025
కాస్త తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.82,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గడంతో రూ.89,620కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1040 తగ్గడం గమనార్హం.