News July 13, 2024
అలా చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయం: కిషన్ రెడ్డి

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఎండగట్టి సమస్యలపై పోరాటం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధిస్తామని పార్టీ సమావేశంలో జోస్యం చెప్పారు. ‘కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టి గెలిచింది. ఆ పార్టీ నిరంకుశ, అప్రజాస్వామిక విధానాల కారణంగా ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతోంది’ అని విమర్శించారు.
Similar News
News November 20, 2025
రెండో సారి తల్లి కాబోతున్న హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ రెండో సారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో తెలియజేశారు. బేబీ బంప్తో పింక్ కలర్ డ్రెస్లో ఫొటోలకు పోజులిచ్చారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ 2022లో కుమారుడికి జన్మనిచ్చారు. అతడికి ‘వాయు’ అని నామకరణం చేశారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురే సోనమ్.
News November 20, 2025
రేవంత్ దుర్మార్గాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం: హరీశ్ రావు

TG: ఫార్ములా ఈ-కార్ రేసును పూర్తి పారదర్శకతతో నిర్వహించామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. KTR ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించారు. ‘KTRపై కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ ఇది. ప్రశ్నించే గొంతులను CM రేవంత్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. KTRకు BRS అండగా ఉంటుంది. రేవంత్ దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం’ అని ట్వీట్ చేశారు.
News November 20, 2025
నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ

HYD నాంపల్లి సీబీఐ కోర్టులో YCP అధినేత జగన్ విచారణ ముగిసింది. కోర్టులో ఆయన 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు. వ్యక్తిగతంగా హాజరైనట్లు కోర్టు రికార్డులో నమోదు చేసింది. విచారణ అనంతరం ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. కాసేపట్లో లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లనున్నారు. విదేశీ పర్యటన పిటిషన్కు సంబంధించి జగన్ కోర్టుకు హాజరయ్యారని, ఛార్జ్షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని ఆయన లాయర్ తెలిపారు.


