News September 11, 2025

ఇలా ఉంటే మీ డిప్రెషన్‌ తొలగుతుంది!

image

ప్రస్తుతం చాలా మందిలో డిప్రెషన్, అసూయ, అభద్రతా భావం నెలకొంటోంది. అయితే వీటిని ఎలా అధిగమించాలో తెలపాలని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మానసిక వైద్యుడు శ్రీకాంత్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మనకున్నది కోల్పోతే అది దిగులు. మనకులేనిది పక్కోడికి ఉంటే అది అసూయ. మనకున్నది పోతుంది అనుకుంటే ఆందోళన. అదే మనకేమీ లేదనుకుంటే ఇలాంటి సమస్యలేవీ ఉండవు’ అని ఆయన తెలిపారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News September 11, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.

News September 11, 2025

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

image

TG: BRS అధినేత KCR స్వగ్రామమైన సిద్దిపేట(D) చింతమడక గ్రామస్థులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిశారు. HYD బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి వచ్చి ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆహ్వానించారు. ‘గొప్ప ఉద్యమకారుడిని కన్న ఊరు మా చింతమడక. పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఈ సమయంలో మీరంతా వచ్చి నాకు ఇచ్చింది మామూలు ధైర్యం కాదు’ అని కవిత అన్నారు.

News September 11, 2025

నా కుమారుడు YSR వారసుడే: షర్మిల

image

AP: YCP, జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘నా బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే YCP ఇంతలా రియాక్ట్ అవుతోందంటే భయమా? నా కుమారుడికి రాజారెడ్డి అనే పేరు YSR పెట్టారు. ఎవరెన్ని వాగినా నా కొడుకు ఆయన వారసుడే. జగన్‌కు అసలు ఐడియాలజీ ఉందా? YSR బతికి ఉండి ఉంటే మీరు చేసిన పనికి తలదించుకునేవారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.