News January 3, 2025

చలికాలంలో నెయ్యి వేసుకొని టీ తాగితే..

image

గరమ్ గరమ్ ఛాయ్ అంటే ఇష్టపడనిదెవరు! చలికాలంలో దేశీనెయ్యి వేసుకొని టీ తాగితే బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇందులోని మేధ్యరస గుణాలు కెఫిన్‌తో కలిసి మెదడును చైతన్యవంతం చేస్తాయి. మెమరీ పవర్‌ను పెంచుతాయి. ఇక యాంటీఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ మూడ్ స్వింగ్స్ నుంచి రిలీఫ్ ఇస్తాయి. స్ట్రెస్‌, లేజీనెస్, వీక్‌నెస్‌ను తొలగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటాయి.

Similar News

News November 14, 2025

BRS ఓటమి.. కవిత సంచలన ట్వీట్

image

TG: జూబ్లీహిల్స్‌లో BRS ఓటమి వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ దండం పెట్టే ఎమోజీలతో ట్వీట్ చేశారు. దీంతో ‘కవితక్కతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు’ అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల BRS నుంచి బయటికి వచ్చిన కవిత కేసీఆర్ మినహా మిగతా నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

News November 14, 2025

1GW డేటా సెంటర్ పెట్టనున్న రిలయన్స్: లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించడంలో CM చంద్రబాబు ముందుంటారని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో 1 GW AI డేటా సెంటర్ నెలకొల్పబోతోందని చెప్పేందుకు ఆనందిస్తున్నాను. ఇది ఫుల్లీ మాడ్యూలర్, వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ GPU, TPU, AI ప్రాసెసర్స్‌ను హోస్ట్ చేసేలా ఫ్యూచర్ రెడీగా ఉంటుంది. అలాగే రిలయన్స్ 6GWp సోలార్ ప్రాజెక్టునూ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది’ అని తెలిపారు.

News November 14, 2025

చిన్నారులు, టీనేజర్లకు బీపీ.. 20 ఏళ్లలో డబుల్

image

అధిక రక్తపోటుతో బాధపడుతున్న చిన్నారులు, టీనేజర్ల సంఖ్య 20 ఏళ్లలో డబుల్ అయినట్టు వెల్లడైంది. 2000లో 3.2% ఉండగా 2020కి 6% పెరిగిందని తేలింది. 21 దేశాలకు చెందిన 4,43,000 మంది చిన్నారుల హెల్త్ రిపోర్టులను పరిశీలించినట్టు జర్నల్ ప్రచురించింది. ‘బీపీకి చికిత్స చేయించకపోతే భవిష్యత్తులో గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒబెసిటీ ఉన్న ఐదుగురు చిన్నారుల్లో ఒకరు బీపీతో బాధపడుతున్నారు’ అని పేర్కొంది.