News January 3, 2025
చలికాలంలో నెయ్యి వేసుకొని టీ తాగితే..
గరమ్ గరమ్ ఛాయ్ అంటే ఇష్టపడనిదెవరు! చలికాలంలో దేశీనెయ్యి వేసుకొని టీ తాగితే బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఇందులోని మేధ్యరస గుణాలు కెఫిన్‌తో కలిసి మెదడును చైతన్యవంతం చేస్తాయి. మెమరీ పవర్‌ను పెంచుతాయి. ఇక యాంటీఆక్సిడెంట్స్, హెల్తీ ఫ్యాట్స్ మూడ్ స్వింగ్స్ నుంచి రిలీఫ్ ఇస్తాయి. స్ట్రెస్, లేజీనెస్, వీక్‌నెస్‌ను తొలగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటాయి.
Similar News
News January 16, 2025
ఖో ఖో వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు భారత్
ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి.
News January 16, 2025
తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి
AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.
News January 16, 2025
హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.