News August 11, 2024
టిఫిన్ తినే ముందు పండ్లు తింటే…
రోజూ టిఫిన్‌గా ఇడ్లీ, దోశ తదితరమైనవి తినడం ఎక్కువమందికి అలవాటు. దీని వల్ల అరగంటలోనే మధుమేహం పెరిగిపోతుందని జీర్ణకోశ వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి ముందుగా ఏదైనా ఒక పండును తింటే టిఫిన్ తర్వాత షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని సూచిస్తున్నారు. పండ్లలో ఉండే పీచు పదార్థం కారణంగా ఆ తర్వాత తిన్న టిఫిన్ కూడా సులువుగా జీర్ణమవుతుందంటున్నారు. భోజనంలోనూ పండ్లు, కూరగాయల్ని భాగంగా చేసుకోవాలని పేర్కొంటున్నారు.
Similar News
News September 15, 2024
Learning English: Synonyms
✒ Amazing: Incredible, Unbelievable
✒ Anger: Enrage, Infuriate, Arouse
✒ Angry: Wrathful, Furious, Enraged
✒ Answer: Reply, Respond, Retort
✒ Ask: Question, Inquire, Query
✒ Awful: Dreadful, Terrible, Abominable
✒ Bad: Depraved, Rotten, Sinful
✒ Beautiful: Gorgeous, Dazzling, Splendid
✒ Begin: Start, Open, Launch, Initiate
News September 15, 2024
రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత
FY2022-23లో ₹1.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత జరగగా, FY2023-24లో ఆ మొత్తం ₹2.01 లక్షల కోట్లుగా నమోదైనట్లు DGGI వెల్లడించింది. ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో అత్యధికంగా ₹81,875cr ఎగవేత జరిగినట్లు తెలిపింది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(₹18,961cr), ఖనిజాలు(₹16,806cr), పొగాకు, సిగరెట్ ఉత్పత్తులు(₹5,794cr), కాంట్రాక్టు సర్వీసెస్(₹3,846cr) రంగాలు ఉన్నాయని పేర్కొంది.
News September 15, 2024
ఎమ్మెల్యేలు రోడ్డెక్కి తన్నుకోవడం బాధ కలిగించింది: భట్టి
TG: కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై dy.cm భట్టి విక్రమార్క స్పందించారు. బాధ్యతగల MLAలు రోడ్డెక్కి తన్నుకోవడం బాధ కలిగించిందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ప్రతిపక్ష హోదా లేకుండా CLP సీటును సైతం లాగేసుకుందని, తాము వారిలా ప్రవర్తించడం లేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినిపించాలని కోరుకుంటున్నామని తెలిపారు.