News April 15, 2025
వేసవిలో ఈ కూరగాయలు తింటే..

వేసవిలో డీహైడ్రేషన్‌కు కారణమయ్యే కూరగాయలను దూరం పెట్టాలని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపింది. వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలో వేడిని పెంచి స్కిన్ రాషెస్‌కు దారితీస్తాయి. ఉల్లిపాయ వంటలో వాడినప్పుడు హీట్‌ను పెంచి ఎసిడిటీకి కారణమవుతుంది. బీట్‌రూట్‌తో వేడిగడ్డలు అవుతాయి. కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ శరీరం డీహైడ్రేట్ అయ్యేలా చేస్తాయి. కీర, సొరకాయ, పుదీనా, ఆకుకూరలు తినాలి.
Similar News
News April 19, 2025
TODAY HEADLINES

✒ UPI పేమెంట్స్‌పై 18% GST వార్తలు ఫేక్: కేంద్రం
✒ త్వరలో ISSకు భారత వ్యోమగామి శుభాంశు
✒ AP: ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు విడుదల
✒ బెట్టింగ్ వ్యతిరేక విధానం తెస్తాం: లోకేశ్
✒ APకి రూ.28,842 కోట్ల మద్యం ఆదాయం
✒ TTD ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలి: సుబ్రహ్మణ్యస్వామి
✒ TGలో NTT డేటా సంస్థ రూ.10,500కోట్ల పెట్టుబడి
✒ రేవంత్.. మీ బాస్‌ల కేసుపై మౌనమెందుకు?: KTR
✒ నేషనల్ హెరాల్డ్ కేసుతో BJPకి సంబంధం లేదు: బండి
News April 19, 2025
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

ఛానల్ అప్డేట్స్, మెసేజ్‌లను ఇతర భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసుకోగలిగే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. లేటెస్ట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుని ట్రాన్స్‌లేషన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోవాలి. హిందీ సహా స్పానిష్, రష్యన్, అరబిక్ తదితర విదేశీ భాషలు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో రోల్ ఔట్ కానుంది.
News April 19, 2025
‘జాట్’లో ఆ సీన్ తొలగింపు

జాట్‌లో ఓ సీన్ తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ క్రైస్తవులు ఆరోపించడంతో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎవరి మనోభావాల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్‌ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.