News July 12, 2024
సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే జైలుకే: పోలీసులు

TG: తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంపై పోలీసులు ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియాలో, డిజిటల్ వేదికల్లో అసభ్యకరమైన, విద్వేషకరమైన వ్యాఖ్యలు జైలు గోడల మధ్య బందీకి దారి తీస్తాయి. సమాజంలో స్నేహపూర్వక వాతావరణానికి ఇబ్బంది కలిగించకుండా మనుషులమనే విచక్షణతో ప్రవర్తించాలి. సోషల్ మీడియాలో మీ, మీ కుటుంబ వ్యక్తిగత ఫోటోలు పోస్ట్ చేయకండి’ అని కోరారు.
Similar News
News February 12, 2025
రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే..!

ప్రతిరోజూ 10వేల అడుగులు వేయడం వీలుకాని వారు కనీసం ఆపకుండా 30 నిమిషాలు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ‘అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అకాల మరణం నుంచి తక్కువ ప్రమాదం ఉంటుంది’ అని తెలిపారు. అయితే, నెమ్మదిగా నడవొద్దని, కాలక్రమేణా వేగాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇది శరీర జీవక్రియ, శ్వాసకోశ, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
News February 12, 2025
కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయి: మాజీ మంత్రి

TG: తెలంగాణ, ఏపీని మద్యం మాఫియా నడిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు రాష్ట్రాలు ఒప్పందంతో నడుస్తూ ఒకేసారి మద్యం ధరలు పెంచాయని అన్నారు. కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయని తెలిపారు. ధరలు ఎవరు పెంచుతున్నారో తమకు తెలుసని, త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
News February 12, 2025
‘స్పిరిట్’: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కథను డైరెక్టర్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈక్రమంలో కొత్త/ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న నటీనటులను తీసుకునేందుకు మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. దీంతో చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈలెక్కన అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.